లాక్డౌన్ లో ఎక్కువ ఉద్యోగాలు అందించిన రాష్ట్రం అదే..

-

లాక్డౌన్ టైమ్ లో ఎందరో తమ ఉద్యోగాలను కోల్పోయారు. చాలామంది జీవితాలు తల్లకిందులు అయిపోయాయి. అనుకోకుండా వచ్చిన ఉపద్రవం వల్ల అనేక మంది జీవితాలు తారుమారయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వాలు చాలామందికి ఉద్యోగాలు కల్పించాయి. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం(PMEGP) కింద దేశవ్యాప్తంగా లక్షా పదివేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇదంతా లాక్డౌన్ టైమ్ లో జరిగింది.

ఐతే ఇందులో అత్యధిక ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ మొదటిస్థానంలో నిలిచింది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం కింద ఉత్తరప్రదేశ్ లో 14,616మంది ఉద్యోగం దొరికింది. ఆ తర్వాత 11,064 మందితో జమ్మూ కాశ్మీర్ రెండవ స్థానంలో ఉంది. మరికొన్ని రాష్ట్రాలని చూసుకుంటే హర్యానా 3008, ఉత్తరాఖండ్ 2344, జార్ఖండ్ 1336, బీహార్ 3168, ఢిల్లీ 72 ఉద్యోగాలు కల్పించాయి.

Read more RELATED
Recommended to you

Latest news