టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోని ఇంట్లో పంత్‌ దీపావళి వేడుకలు

-

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ గురించి తెలియని వారుండరు. గాయాల నుంచి వేగంగా కోలుకొని, ప్రాక్టీస్ మొదలుపెట్టిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ దీపావళి వేడుకను మాజీ కెప్టెన్ ధోని ఫ్యామిలీతో కలిసి చేసుకున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వికెట్ కీపర్ల మధ్య ప్రత్యేక అనుబంధం ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్దరిని ఒకే ఫోటోలో చూడడం ఆనందంగా ఉందని పేర్కొంటున్నారు.

MS Dhoni celebrates Diwali 2023 with Rishabh Pant, Sakshi shares festive photos

ఇది ఇలా ఉండగా.. అటు వరల్డ్ కప్ లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమ్ ఇండియా మొన్న బెంగళూరులో దీపావళి వేడుకలు చేసుకుంది. కెప్టెన్ రోహిత్, కోహ్లీ దంపతులతో పాటు ఇతర ఆటగాళ్లు సాంప్రదాయ దుస్తులు ధరించి సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. అందరూ సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఎక్స్ క్లూజివ్ వీడియోను బీసీసీఐ తాజాగా ట్వీట్ చేసింది. కాగా WCలో భాగంగా టీమిండియా నిన్న నెదర్లాండ్స్ తో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ లో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news