BREAKING : బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న తుల ఉమ

-

వేములవాడ బీజేపీ నేత తుల ఉమ సొంత గూటికి వెళ్లనున్నారు. వేములవాడ బీజేపీ నేత తుల ఉమ నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. బీజేపీకి తుల ఉమ రాజీనామా చేశారు. బిజెపి నేత తుల ఉమా సొంతగూటికి చేరనున్నారు. దీంతో నాలుగు రోజులుగా సాగుతున్న హైడ్రామాకు తెలపడింది.

BJP leader Tula Uma will join the BRS party today in the presence of BRS working president and minister KTR

వేములవాడ నుంచి బీజేపీ టికెట్ ఆశించిన ఆమె చివరి నిమిషంలో తీవ్ర అవమానాల పాలయ్యారు. వేములవాడ అసెంబ్లీ సీటుకు టికెట్ ఇచ్చిన బిజెపి చివరి నిమిషంలో బిఫామ్ వేరొకరికి ఇచ్చింది. దీంతో ఆమె తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. తన అనుచరులతో సమావేశాలు అనంతరం తిరిగి బిఆర్ఎస్ లో చేరడానికి నిర్ణయించుకున్నారు. కెసిఆర్ తో ఆమె ఫోన్ లో మాట్లాడారు. పార్టీలో చేరే విషయం చర్చించారు. కేసీఆర్ స్పష్టమైన హామీల తర్వాత బీఆర్ఎస్ లో చేరడానికి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news