మాజీ ఇండియా కెప్టెన్ మరియు ప్రస్తుతం ఐపిఎల్ టీమ్ చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆటతో మరియు తనదైన మంచితనంతో ప్రపంచం నలువైపులా కోట్లాది మంది అభిమానులను గెలుచుకున్నాడు. ఈయన జీవిత చరిత్రను కూడా MS ధోనీ ది అంటోల్డ్ స్టోరీ పేరుతో సినిమాగా చిత్రీకరించారు.

అయితే… తాజాగా మహేంద్ర సింగ్ ధోనీకి అరుదైన గౌరవం దక్కింది. యూఎస్ ఓపెన్ టెన్నిస్ మ్యాచులు చూసేందుకు ఆమెరికా వెళ్లిన టీమిండియా మాజీ కెప్టెన్ ధోనికి అరుదైన గౌరవం దక్కింది. ఆ దేశ మాజీ అధ్యక్షుడు ట్రంప్ గోల్ఫ్ ఆట కోసం ధోనిని ఆహ్వానించాడు. దీంతో అక్కడికెళ్లిన మిస్టర్ కూల్ ఆయనతో సమావేశం అయ్యారు. అనంతరం కాసేపు ట్రంప్ తో కలిసి గోల్ఫ్ ఆడారు.