ముకేశ్ అంబానీకి మరోసారి బెదిరింపులు.. ఈసారి డిమాండ్ ఏంటంటే..?

-

రిలయన్స్‌ ఇండస్ట్రీన్‌అధినేత ముకేశ్ అంబానీకి మరోసారి బెదిరింపులు ఎదురయ్యాయి. ఇప్పటికే పలుమార్లు చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్, మెసేజెస్ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. అయితే ఈసారి సదరు వ్యక్తి రూ.20 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలిసింది. తాను అడిగిన డబ్బు ఇవ్వకపోతే చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది.

ముకేశ్ అంబానీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్‌ ఫిర్యాదుతో ముంబయి గామ్‌దేవీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. షాదాబ్ ఖాన్‌ అనే వ్యక్తి నుంచి ఆ బెదిరింపు మెయిల్‌ వచ్చినట్లు గుర్తించిన పోలీసులు.. అతడి కోసం గాలిస్తున్నారు. అంబానీ కంపెనీకి చెందిన ఓ ఈ-మొయిల్‌ ఐడీకి శుక్రవారం (అక్టోబరు 27వ తేదీ) వచ్చిన బెదిరింపు మెయిల్​లో ‘‘మా దగ్గర మంచి షూటర్లున్నారు. రూ.20కోట్లు ఇవ్వకపోతే చంపేస్తాం’’ అని ఆ మెయిల్‌లో ఆగంతకులు బెదిరింపులకు పాల్పడ్డట్లు పోలీసులు వెల్లడించారు.

గతేడాది కూడా అంబానీ కుటుంబానికి ఇలాంటి బెదిరింపు వచ్చింది. 2022 ఆగస్టు 15వ తేదీన ఓ వ్యక్తి రిలయన్స్‌ ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న హర్‌కిసాన్‌దాస్‌ ఆసుపత్రిని పేల్చేస్తామని, అంబానీ కుటుంబాన్ని చంపేస్తామని హెచ్చరిస్తూ బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news