విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి యూఏఈ తో పాటు మరి కొన్ని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ టెస్టు అవసరం లేదని ప్రకటించింది. అంతే కాకుండా ఏడు రోజులు ఉండాల్సిన క్వారైంటెన్ నిబంధనలను కూడా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎత్తి వేసింది. కేవలం కరోనా వైరస్ రిస్క్ ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు మాత్రమే.. ఆర్టీపీసీఆర్ టెస్టు తో పాటు ఏడు రోజుల క్వారైంటెన్ నిబంధన ఉంటుందని ప్రకటించింది.
నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎలాంటి నిబంధనలు ఉండవని తెలిపింది. ఈ కొత్త మార్గదర్శకాలు ఈ నెల 17 నుంచి అమలు కానున్నాయని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. అయితే ముంబై నగరంలో కరోనా వ్యాప్తి బారీలో ఉంది. రోజు పది వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. అయితే ఇలాంటి సందర్భంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఈ నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.