తనపై గెలిచిన ఎమ్మెల్యేకు అభినందనలు తెలిపిన నవీన్ పట్నాయక్

-

Naveen Patnaik meets BJP MLA Laxman Bag: తనపై గెలిచిన ఎమ్మెల్యేకు అభినందనలు తెలిపారు ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్. ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ రెండు చోట్ల పోటీ చేయగా ఓ చోట గెలిచి, ఓ చోట ఓడిపోయారు.. కాగా నిన్న అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేసిన ఆయన తోటి సభ్యులను పలకరించారు.

Naveen Patnaik meets BJP MLA Laxman Bag who defeated him from Kantabanji in Odisha Assembly

ఈ క్రమంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ లేచి తనను తాను పరిచయం చేసుకోగా.. నవీన్ పట్నాయక్ వెంటనే మీరేనా నన్ను ఓడించింది అని నవ్వుకుంటూ అభినందనలు తెలిపారు. కాగా, ఒడిశా ముఖ్యమంత్రిగా ఆదివాసీ నేత మోహన్ చరణ్ మాఝిని బీజేపీ హైకమాండ్ ఎంపిక చేసింది. అధిష్ఠానం నిర్ణయంతో బీజేపీ ఎమ్మెల్యేలంతా ఆయనను శాసనసభాపక్షనేతగా ఎన్నుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news