సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ యూజీ 2024 రివైజ్డ్ స్కోర్‌కార్డ్ 2024 ని తాజాగా విడుదల చేసింది. అస్పష్టమైన ఫిజిక్స్ ప్రశ్న నేపథ్యంలో సుప్రీంకోర్టు అదేశాల మేరకు ఫలితాలను సవరించి మళ్లీ విడుదల చేశారు. దీని ఫలితంగా మెరిట్ జాబితా రీకాలిబ్రేషన్ జరిగింది.
విద్యార్థుల ఆందోళనల మధ్య సుప్రీం కోర్టు జోక్యంతో ఐఐటీ-ఢిల్లీ నిపుణుల కమిటీ ఆధారంగా వివాదాస్పద ప్రశ్నకు ఒక సరైన ఎంపికను మాత్రమే ఆమోదించడం తప్పనిసరి చేసింది. నీట్ యూజీ సవరించిన స్కోర్‌కార్డ్ 2024లో ఈ సర్దుబాటు కారణంగా ఇప్పుడు ఆమోదించబడిన సమాధానాన్ని ఎంచుకున్న దాదాపు 4.2 లక్షల మంది విద్యార్థుల స్కోర్ లు ప్రభావితమయ్యాయి. ఇక టాప్ స్కోరర్‌ల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్ exams.nta.ac.in/NEET లాగిన్ అయి నీట్ యూజీ ఫైనల్ రిజల్ట్ స్కోర్‌కార్డ్ 2024 ఫలితాలను తెలుసుకోవచ్చు.