World Cup 2023 : సఫారీలకు షాక్.. నెదర్లాండ్స్ సంచలన విజయం

-

వరల్డ్ కప్ లో మరో సంచలనం నమోదయింది. మొన్న ఇంగ్లాండ్ పై ఆఫ్గనిస్తాన్ గెలవగా…. తాజాగా సౌత్ ఆఫ్రికాకు నెదర్లాండ్స్ షాక్ ఇచ్చింది. 246 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా 207 పరుగులకే ఆల్ అవుట్ అయింది. సఫారీ జట్టులో మిల్లర్ 43, మహారాజ్ 40, రన్స్ చేసి పరవాలేదనిపించగా…. మిగతా ఎవరూ రాణించలేదు.

Netherlands won by 38 runs
Netherlands won by 38 runs

నెదర్లాండ్స్ బౌలర్లలో వ్యాన్ బీక్ 3, మీకే రెన్, వాన్ డేర్ మెర్వ్, లీడే తలో 2, ఆకేర్ మెన్ ఒక వికెట్ తీశారు. ధర్మశాల వేదికగా జరిగిన వరల్డ్ కప్ మ్యాచులో సౌత్ ఆఫ్రికాను నెదర్లాండ్స్ 38 రన్స్ తేడాతో ఓడించింది. అయితే, సఫారీలను ఓడించడం డచ్ జట్టుకు ఇదేం కొత్త కాదు. గతంలోనూ 2022 టీ20 వరల్డ్ కప్ లో ప్రోటీస్ జట్టును నెదర్లాండ్స్ 13 పరుగుల తేడాతో ఓడించింది. అప్పుడు ఏకంగా ప్రపంచకప్ నుంచి దక్షిణాఫ్రికాను ఇంటికి పంపింది.

Read more RELATED
Recommended to you

Latest news