రామేశ్వరం కేఫ్‌ వెనుక కుట్ర.. ఎన్‌ఐఏ దర్యాప్తు ముమ్మరం

-

కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్‌లోని రామేశ్వరం కేఫ్‌లో మార్చి ఒకటో తేదీన బాంబు పేలుడు జరిగిన ఘటనలో ఎన్‌ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో కీలక సాక్ష్యాల సేకరణలో బిజీ అయింది. ఈ క్రమంలోనే ఈ కేసులో నిందితుడు ముసావిర్‌ హుసేన్‌తో ఆ హోటల్‌లో సీన్ రీ క్రియేట్ చేసింది. పేలుడు పదార్థాన్ని హోటల్‌లో ఉంచిన ఆ నిందితుడు ఎటువైపు నుంచి హోటల్‌లోకి వచ్చాడనే విషయాన్ని తెలుసుకుంది. ఆ రోజు అతను ధరించిన దుస్తులు, టోపీలనే మళ్లీ వేయించి.. అక్కడి నుంచి అతను బస్టాప్‌కు వెళ్లడం, బస్సు ప్రయాణించిన మార్గంలోనూ ఎన్‌ఐఏ సీన్ రీక్రియేట్ చేసింది.

ఆ రోజు జరిగిన పేలుడులో హోటల్‌ సిబ్బందితో కలిపి పది మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీసీబీ దర్యాప్తు ప్రారంభించి, మార్చి 3న ఆ బాధ్యతలను ఎన్ఐఏకు అప్పగించగా.. నిందితుడి వివరాలను చెబితే రూ.10 లక్షలు ఇస్తామని ఎన్‌ఐఏ ప్రకటించింది. ఈ క్రమంలోనే ముసావిర్, అబ్దుల్‌ మతీన్‌ తాహలను ఏప్రిల్‌ 12న పశ్చిమ బెంగాల్‌లో అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news