ఓమిక్రాన్ పై అప్ర‌మ‌త్తం అవుతున్న రాష్ట్రాలు.. నైట్ క‌ర్ప్యూ అమలు

ఓమిక్రాన్ పై దేశం లో ప‌లు రాష్ట్రాలు అప్ర‌మ‌త్తం అవుతున్నాయి. ప‌లు రాష్ట్రాల‌లో క‌ఠిన ఆంక్ష‌లు పెడుతున్నారు. ఓమిక్రాన్ వేరియంట్ ను నిల‌వ‌రించ‌డానికి కొన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు నైట్ క‌ర్ప్యూ ను అమలు చేస్తున్నాయి. ఓడిశా రాష్ట్రంలో ముఖ్య మంత్రి న‌వీన్ ప‌ట్నాయక్ కీలక నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ నెల 25 నుంచి జనవరి 2 వరకు రాష్ట్రంలో కఠిన ఆంక్షలు ఉంటాయని ప్ర‌క‌టించారు. క్ల‌బ్స్, రెస్టారెంట్లు, పార్క్, హోట‌ల్స్, సంగీత ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో పాటు ఎక్కువ మంది జ‌నాలు గుమి కూడ‌టం వంటి పై నిషేధం విధించింది.

అలాగే మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఓమిక్రాన్ ప‌ట్ల కఠిన ఆంక్షలకు అమలు చేస్తుంది. క్రిస్మస్​, నూతర సంవత్సర వేడుకల నేపథ్యంలో ఓమిక్రాన్ వేరియంట్ విస్త‌రించే అవ‌కాశం ఉండ‌టంతో ఆంక్ష‌లు ఉండ‌నున్నారు. మధ్యప్రదేశ్ ముఖ్య మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్ కూడా రాష్ట్రంలో నైట్​ కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్ర‌జ‌లు ఎక్కువ గుమ్మికూడ‌టం పై నిషేధం విధించారు. అలాగే ఉత్త‌ర ప్ర‌దేశ్ ముఖ్య మంత్రి యోగి అధిత్య‌నాథ్ కూడా క‌ఠిన అంక్ష‌లు విధించారు. డిసెంబర్​ 25 నుంచి రాష్ట్రంలో నైట్ క‌ర్ప్యూ ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. వివాహ వేడుకలకు 200 మంది మించి అనుమ‌తి ఉండ‌ద‌ని ప్ర‌క‌టించారు.