భారత దేశ రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పేందుకు సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం అందుతోంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న రూ.6 వేల ఆర్థిక సాయాన్ని రూ.10 వేలకు పెంచనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ప్రవేశ పెట్టనున్న 2022 బడ్జెట్ లో… కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని ప్రకటించే చాన్స్ ఉంది.
రూ.6 వేల సాయంతో పెద్దగా చేకూరుతున్న ప్రయోజనమేమీ లేదన్న అభిప్రాయాలు రైతుల నుంచి వ్యక్తమవుతున్నాయి. అలాగే.. ఈ నెలలో 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అటు కొత్త వ్యవసాయ చట్టాలతో కేంద్ర ప్రభుత్వంపై రైతులు చాలా సీరియస్ గా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో.. రైతులకు నేరు గా డబ్బులు ఇస్తేనే.. భవిష్యత్తు బాగుంటుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే.. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఇచ్చే డబ్బులను పెంచేందుకు నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.