కోటి మంది యువతకు ఉద్యోగాల కల్పన : నిర్మలా సీతారామన్

-

కేంద్ర బడ్జెట్ 2024-24 సమావేశాలు కొనసాగుతున్నాయి. లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ బడ్జెట్లో నిర్మలమ్మ ఉద్యోగులపై వరాలు కురిపించారు. ఉద్యోగాల కల్పన, నైపుణ్యాభివృద్ధికి రెండో ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. కోటి మందికి ఉద్యోగం కల్పించే దిశగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. సంఘటిత రంగంలో ఈపీఎఫ్‌వోలో నమోదైన కార్మికులకు నెల జీతం ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. నెల జీతాన్ని మూడు వాయిదాల్లో ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. తయారీ రంగంలో కొత్త ఉద్యోగులకు నెల జీతం అందుతుందని వెల్లడించారు.

అదనపు ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు అదనపు ప్రోత్సాహం అందించనున్నట్లు పేర్కొన్నారు. రూ.లక్షలోపు జీతం ఉన్న ఉద్యోగులకు ప్రతి నెలా రూ.3 వేలు చొప్పున ఈపీఎఫ్‌వోలో ఉద్యోగి పేరున జమ చేస్తామని వివరించారు. వచ్చే ఐదేళ్లలో 20 లక్షలమందికి నైపుణ్యాభివృద్ధి సంస్థల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు అవసరమైన రుణ సదుపాయం కల్పిస్తామని.. భారతీయ విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులకు 3 శాతం వడ్డీ రాయితీ ఇస్తామని ప్రకటించారు. స్వయం ఉపాధి పొందుతున్న చేతివృత్తి మహిళలకు రుణ సాయం పెంపు ఉంటుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news