గుడ్​న్యూస్.. థాయ్​లాండ్ వెళ్లే ఇండియన్స్​కు ఇక వీసా అక్కర్లేదు

-

సాధారణంగా భారత్​ నుంచి ఏదైనా విదేశాలకు వెళ్లాలంటే దాదాపుగా వీసా అవసరం. ఇక థాయ్​లాండ్ టూరిస్ట్ కంట్రీస్​కు మరీ తప్పనిసరి. కానీ ఇప్పుడు థాయ్​లాండ్ సర్కార్ భారతీయ టూరిస్టులకు ఓ శుభవార్త చెప్పింది. ఆ దేశ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు.. మరింత మంది టూరిస్టులను ఆకర్షించేందుకు థాయ్‌లాండ్‌ సర్కార్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటంటే..?

భారతదేశం నుంచి వచ్చే టూరిస్టులు వీసా లేకుండానే తమ దేశంలో 30 రోజులపాటు పర్యటించేందుకు అనుమతించాలని థాయ్ సర్కార్ నిర్ణయించింది. భారత్​తో పాటు ఈ అవకాశం తైవాన్ దేశస్థులకు కూడా ఇచ్చింది. ఈ అవకాశం నవంబరు 10వ తేదీ నుంచి వచ్చే ఏడాది మే 10 వరకు ఉంది. ఈ గడువు లోపల ఈ రెండు దేశాల నుంచి టూరిస్టులు వీసా లేకుండా వచ్చే అవకాశాన్ని కల్పించింది. ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించాలనే ఉద్దేశంతో థాయ్‌లాండ్‌ కేబినెట్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ ప్రధాని శ్రేట్టా థవిసిన్‌ వెల్లడించారు. గత నెలలో చైనా నుంచి వచ్చే పర్యాటకులకు థాయ్‌లాండ్‌ వీసా మినహాయింపును ఇచ్చిన విషయం తెలిసిందే. సాధారణంగా మలేసియా, చైనా, దక్షిణ కొరియా తర్వాత భారత్‌ నుంచే ఎక్కువ మంది పర్యాటకులు థాయ్‌లాండ్‌కు వెళ్తుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news