సచిన్ పైలట్-సారా విడాకులు.. ఎలక్షన్ అఫిడవిట్​తో వెలుగులోకి వచ్చిన విషయం

-

రాజస్థాన్ శాసనసభ ఎన్నికల వేళ ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ విడాకుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. టోంక్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పైలెట్నా మినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ లో స్పౌజ్ అనే ఆప్షన్ వద్ద డివోర్స్ అని పేర్కొన్నారు. 2004 సంవత్సరంలో సచిన్ పైలట్ సారా అబ్దుల్లాను పెళ్లి చేసుకున్నారు. సారా అబ్దుల్లా.. ఆమె జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా కుమార్తె. వారికి ఇద్దరు కుమారులు అరాన్, విహాన్ ఉన్నారు. వారిద్దరూ ప్రస్తుతానికి తనపై ఆధారపడి ఉన్నారని పైలట్ తన అఫిడవిట్ లో పేర్కొన్నారు.

సచిన్ పైలెట్, సారా విడిపోయినట్లు 9 ఏళ్ల కిందటే ప్రచారం జరిగింది. 2014 లోక్ సభ ఎన్నికల వేళ ప్రచారంలోకి వచ్చిన ఆ వార్తలను ఆయన ఖండించారు. 2018 డిసెంబరులో సచిన్ పైలెట్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగా ఆ కార్యక్రమానికి ఫరూక్ అబ్దులా, సారా, అరాన్ , విహాన్ హాజరయ్యారు. తాజాగా ఎన్నికల అఫిడవిట్ వెలుగులోకి రావడంతో మరోసారి సచిన్ పైలట్ దంపతుల విడాకులపై చర్చ మొదలైంది.

Read more RELATED
Recommended to you

Latest news