ఈ సేవలు పొందేందుకు ఇక ఆధార్‌ అవసరం లేదు.. మారిన రూల్స్‌ తెలుసుకోండి..!

-

పెన్షనర్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఇకపై వారు డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికెట్లను పొందేందుకు ఆధార్‌ను అందించాల్సిన పనిలేదు. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు రూల్స్‌ను మార్చింది. డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికెట్లను పొందేందుకు ఆధార్‌ను కేంద్రం ఐచ్ఛికం చేసింది. దీని వల్ల పెన్షనర్లకు ఊరట కలిగింది.

now aadhar is not required for this service know the rules

కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మార్చి 18వ తేదీన ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ క్రమంలో ఆధార్‌ను సమర్పించడాన్ని, ఆధార్‌ ఆథెంటికేషన్‌ను వాలంటరీగా చేసింది. లైఫ్‌ సర్టిఫికెట్లను అందించే సంస్థలు ఆధార్‌ కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాల్సి ఉంటుంది.

పెన్షనర్లు పెన్షన్‌ పొందేందుకు ఇప్పటి వరకు లైఫ్‌ సర్టిఫికెట్లు కావాల్సి వచ్చేవి. ఇందుకు గాను వారు ఎంతో దూరం ప్రయాణిస్తూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అలాగే ఆధార్‌ ఆథెంటికేషన్‌ సమస్యలు కూడా వచ్చేవి. ఈ క్రమంలో ఈ ఇబ్బందులన్నింటినీ తొలగించేలా ఆధార్‌ ను వాలంటరీ చేశారు. అందువల్ల పెన్షనర్లు ఆధార్‌ను ఇవ్వాలా, వద్దా అనే విషయం వారి సొంత నిర్ణయంపై ఆధార పడి ఉంటుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో మంది పెన్షనర్లకు ఊరటను అందిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news