ఒడిశాలో జనాలపైకి ఎక్కిన ఎమ్మెల్యే కారు… ఎమ్మెల్యేను చితకబాదిన ప్రజలు

-

ఒడిశాలో లఖీంపూర్ ఖేరీ ఘటనలా మరో ఘటన జరిగింది. ఎమ్మెల్యే కారు సాధారణ ప్రజలపైకి ఎక్కింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా.. దాదాపు 23 మంది ప్రజలకు గాయాలయ్యాయి. ఒడిశాలోని ఖుర్ధాలో ఈ ఘటన చోటు చేసుకుంది. బీజేడీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే ప్రశాంత్ జగ్ దేవ్ కారు గుమిగూడి ఉన్న ప్రజలపైకి తీసుకెళ్లాడు. బ్లాక్ చైర్ పర్సన్ ఎన్నిక జరగుతున్న సమయంలో.. అదే సమయంలో అటుగా వచ్చిన ఎమ్మెల్యే కారు ప్రజలపైకి వెళ్లింది. ఈ ఘటనలో గాయపడిన వ్యక్తుల్లో 7గురు మంది పోలీసులు కూడా ఉన్నారు. మొత్తం గాయపడిన 23 మందిలో 15 మంది బీజేపీ కార్యకర్తలు ఉండగా.. 1 బీజేడీ కార్యకర్త, 7 మంది పోలీసులు ఉన్నారు.

ఈ క్రమంలో ఆగ్రహం చెందిన ప్రజలు ఎమ్మెల్యేపై దాడి చేశారు. ఆవేశంలో ఊగిపోయిన ప్రజలు ఎమ్మెల్యే కారును ధ్వంసం చేయడంతో పాటు… ఎమ్మెల్యేపై తీవ్రంగా దాడి చేశారు. ఎమ్మెల్యేను చితకబాదడంతో ఆయనకు కూడా తీవ్రంగా గాయాలు అయినట్లు తెలుస్తోంది. పార్టీ వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడటంతో ఇటీవల ఆయనను బిజూ జనతాదళ్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news