మళ్ళీ ఉల్లి షాక్…?

-

దేశ వ్యాప్తంగా మరోసారి ఉల్లి ధరలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. మహారాష్ట్రలో దాదాపు 20 రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. రోజు రోజుకి అక్కడ వర్షాల తీవ్రత పెరుగుతుంది. ముంబై సహా నాలుగు జిల్లాలు ఇప్పుడు వర్షాల తీవ్రతతో ఇబ్బంది పడుతున్నాయి. అటు లాతూర్ సహా కొన్ని జిల్లాల్లో వర్షాలు విలయం సృష్టిస్తున్నాయి. దీనితో అక్కడి ఉల్లి పంట భారీగా దెబ్బ తింది.

దీనితో ఉల్లి ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి అని నిపుణులు చెప్తున్నారు. ఉల్లి పంట అక్కడ బాగా నష్టపోయారు అని హైదరాబాద్ కి వచ్చే దాదాపు 80 శాతం ఉల్లి అక్కడి నుంచే వస్తుంది అని తెలిసిందే. దీనితో ఉల్లి ధరలు మరో పది రోజుల్లో పెరిగే సూచనలు ఉన్నాయి అని అంటున్నారు. దీనితో హైదరాబాద్ లో ఉల్లి వ్యాపారులు కాస్త జాగ్రత్త పడుతున్నారు.

గతంలో ఉల్లి రేటు 200కి చేరిన విషయం మనం అంత తొందరగా మరిచిపోలేం కదా. ఉల్లిదండలతో పెళ్లి చేసుకున్న నూతన వధూవరులు, భార్యకు ఉల్లి పోగులు ఇచ్చిన స్టార్ హీరో అంటూ వార్తలు చూశాం. మళ్ళీ ఉల్లి అంతగా ఏడ్పించనుందా..?? పరిస్థితులను చూస్తుంటే మాత్రం కొంత అననుకూలంగానే ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news