కొత్త రికార్డ్ ల దిశగా ఉల్లి…!

-

భారీ వర్షాలు వ్యవసాయ రంగాన్ని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. మన దేశంలో దాదాపుగా వ్యవసాయ రంగం ఈ భారీ వర్షాల ధాటికి తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్ణాటక రాష్ట్రాలు వరదల దెబ్బకు తీవ్రంగా నష్టపోయాయి. ఈ వర్షాల దెబ్బ ఉల్లి ధరల మీద భారీగా పడింది. కర్నూలు మార్కెట్ యార్డులో రికార్డు స్థాయిలో ఉల్లి ధరలు ఉన్నాయి.

క్వింటా ఉల్లి రూ. 4,850 కి చేరుకుంది. ఈ సీజన్లో ఇదే అధిక ధర అని అధికారులు చెప్తున్నారు. రానున్న రోజుల్లో క్వింటా ఉల్లి 10 వేల వరకు పలికే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. వర్షాల కారణంగానే ఈ ఉల్లి ధరలు ఇలా పెరుగుతున్నాయి, మార్కెట్ యార్డుకు గణనీయంగా ఉల్లి దిగుబడులు తగ్గాయని చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version