లోక్ సభ నుంచి విపక్షాల వాకౌట్ అయింది. ఇవాళ ఉదయం నుంచి లోక్ సభలో తీవ్ర గంధర గోళ పరిస్థితులు నెలకొన్నాయి. నీట్ పై చర్చకు స్పీకర్ అనుమతించక పోవడంతో వాక్ఔట్ చేశాయి విపక్షాలు. నీట్ పై చర్చకు కోరారు రాహుల్ గాంధీ. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యావాదాలు చర్చ తర్వాత ఒక రోజు నీట్ పై చర్చ పెట్టాలని కోరారు రాహుల్.
అయితే… నోటీసు ఇస్తే పరిశీలిస్తాం అన్నారు స్పీకర్. ఈ నేపథ్యంలోనే.. లోక్ సభ నుంచి విపక్షాల వాకౌట్ అయింది. కాగా, రెండు రోజుల విరామం తర్వాత సోమవారం పార్లమెంట్ సమావేశాల తిరిగి ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే.. భారత క్రికెట్ జట్టుకు అభినందనలు తెలుపుతూ లోక్‌సభ తీర్మానం చేసింది. మరోవైపు నీట్, యూజీసీ, ఎన్‌టీఏ వైఫల్యం, కొత్త క్రిమినల్ చట్టాలపై విపక్షాల వాయిదా తీర్మానం నోటీసులను స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించారు.