కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచార ఘటన మరవకముందే దేశవ్యాప్తంగా మరికొన్ని అఘాయిత్యాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో యువతులు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. కోల్ కతా ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నా.. మరోవైపు ఈ ఘటనలు ఆగడంలేదు. తాజాగా ఏపీలో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది.
ఇక ఉత్తరాఖండ్‌లో ఓ టీనేజర్‌పై గ్యాంగ్ రేప్ జరిగింది. దెహ్రాదూన్‌లోని అంతర్ రాష్ట్ర బస్ టెర్మినల్ వద్ద ఆగి ఉన్న బస్సులో ఓ అనాథ టీనేజర్ పై ఐదుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఈ ఘటన ఆగస్టు 13వ తేదీన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ బృందం బాధితురాలిని రక్షించి కౌన్సిలింగ్ ఇచ్చిన అనంతరం పటేల్ నగర్ పోలీస్ స్టేషన్లో నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.