ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో ఫైళ్లను దగ్ధం చేసిన ఘటనపై అధికారుల పై ఫైర్ అయ్యారు మంత్రి కందుల దుర్గేష్. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ఎడమ కాలువ నిర్వాసితుల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి సంబంధించి కాల్చివేసిన కాగితాలను పరిశీలించారు మంత్రి దుర్గేష్. ఈ విషయంలో అధికారులపై తీవ్రస్థాయిలో మండిపాటుకు గురయ్యారు.
మీరు జిరాక్స్ కాగితాలని చెప్పుతున్న వీటిలో ఒరిజినల్ కాగితాలు ఉన్నట్లుగా ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి ఈ అపోహలను నివృత్తి చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేసారు. అయితే ఈ ఘటనలో బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలని జాయింట్ కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసారు మంత్రి. క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ కు సూచించారు. అయితే ఈ ఘటనపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది అని.. దీని వెనక ఎవరి ప్రేమేయం ఉన్నా కఠినంగా శిక్షిస్తాం అని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.