మహారాష్ట్ర సీఎంగా పడ్నవీస్.. ఏక్ నాథ్ శిండేకు డిప్యూటీ సీఎం..!

-

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు పై మహాయుతి కూటమి మధ్య చర్చలు కొలిక్కి వచ్చినట్టే అని కనిపిస్తోంది. తదుపరి సీఎంగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర పడ్నవీస్ రాష్ట్ర పగ్గాలు అందుకోనున్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండె డిప్యూటీ సీఎం పదవీ తీసుకోనున్నారు. డిసెంబర్ 05న మహారాష్ట్ర కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని పలు మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈసారి కూడా ఇద్దరూ డిప్యూటీ సీఎంలు ఉంటారని.. శిండేతో పాటు ఎన్సీపీ నేత అజిత్ పవార్ కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలిపాయి.

రేపు బీజేపీ శాసన పక్ష నేతల సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో దేవెేంద్ర పడ్నవీస్ ను సీఎంగా ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. సీఎం పదవీ, శాఖల కేటాయింపు పై మహాయుతి కూటమి మధ్య గత కొంత కాలంగా ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. మరోవైపు డిప్యూటీ సీఎం పదవీ తనకు వద్దని.. హోంశాఖను కేటాయించాలని శిండే పట్టుబట్టినట్టు వార్తలు వినిపించాయి. కానీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, గుజరాత్ సీఎం విజయ్ రూపానీలను పరిశీలకులుగా బీజేపీ నియమించింది. ఎన్డీఏ నేత రామ్ దాస్ అథవాలే ఏక్ నాథ్ శిండేతో చర్చలు జరపడంతో డిప్యూటీ సీఎం పదవీకి అంగీకరించినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news