పాకిస్థాన్ ఐఎస్ఐ ఇన్ఫార్మర్ పఠాన్ ఖాన్ అరెస్ట్ అయ్యాడు. పాకిస్థాన్ ఐఎస్ఐ తరపున గూఢచర్యం చేస్తున్నందుకు జైసల్మేర్ నివాసి పఠాన్ ఖాన్ అరెస్ట్ అయ్యాడు. పఠాన్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు రాజస్థాన్ ఇంటెలిజెన్స్. ఖాన్‌పై అధికారిక రహస్యాల చట్టం 1923 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఖాన్‌ను దాదాపు నెల క్రితం అదుపులోకి తీసుకుని అప్పటి నుంచి ప్రశ్నిస్తున్నారు ఇంటెలిజెన్స్.

ఖాన్‌ను అధికారికంగా మే 1, 2025న అరెస్టు చేశారు ఇంటెలిజెన్స్. పఠాన్ ఖాన్ 2013లో పాకిస్థాన్‌ను సందర్శించాడని, అక్కడ అతను పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులతో సంబంధాలు పెట్టుకున్నాడని పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు భారత ఇంటెలిజెన్స్. డబ్బులకు ఆశపడి ఖాన్ పాకిస్థాన్‌లో గూఢచర్యం శిక్షణ పొందినట్లు సమాచారం అందుతోంది.