ఇవాళ అమరావతి పీఎం మోడీ.. రానున్నారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతిలో రూ.49 వేల కోట్లతో చేపడుతున్న పనులకు శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని మోదీ. రూ. 5028 కోట్లతో చేపట్టే కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. రూ. 3680 కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకున్న జాతీయ రహదారులను ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. రూ.254 కోట్లతో చేపట్టిన మూడు రైల్వే ప్రాజెక్టులు జాతికి అంకితం చేయనున్నారు మోదీ.

రూ. 57,962 కోట్లతో 94 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగనున్నాయి. రాజధానిలో అసెంబ్లీ సెక్రటేరియట్ హైకోర్టు భవనాలు, న్యాయమూర్తుల నివాసాలు, నివాస సముదాయంతో కలిపి 74 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. రూ.1459 కోట్లతో నాగాయలంకలో డీఆర్డిఓ క్షిపణి ప్రయోగ కేంద్రం, రూ.100 కోట్లతో విశాఖలో యూనిటీ మాల్‌కు శంకుస్థాపన చేయనున్నారు. రూ.250 కోట్లతో గుంతకల్ వెస్ట్ మల్లప్ప గేట్ రైల్ ఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. రూ.3176 కోట్లతో జాతీయ రహదారులు, ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జరుగుతాయి.