మూడు భాషలు మాకు వద్దు.. రెండు భాషలే ముద్దు: పళనిస్వామి

-

జాతీయ విద్యా విధానం – 2020 లో కేంద్రం ప్రతిపాదించిన మూడు భాషల సూత్రాన్ని(ప్రాంతీయ భాష, ఆంగ్లం, హిందీ) తమిళనాడులో అమలుచేసేది లేదన్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళని స్వామి. అన్నాడీఎంకే పార్టీ అందుకు అంగీకరించదని స్పష్టం చేశారు. తమిళనాడు రాష్ట్రంలో దశాబ్దాలుగా రెండు భాషల ( తమిళం, ఆంగ్లం) సూత్రాన్నే పాటిస్తున్నట్లు తెలిపారు. ఇకపై కూడా ఆ రెండు భాషల్లోనే బోధన కొనసాగిస్తుందని, అందులో ఎలాంటి మార్పు ఉండబోదని తేల్చిచెప్పారు పళని స్వామి. ప్రాంతీయ భాష, ఆంగ్లంతో పాటు కచ్చితంగా హిందీ భాషలో బోధించమని రాష్ట్రాలను ఆదేశించడపై కేంద్రం పునరాలోచించుకోవాలన్నారు ఆయన తెలిపారు.

K-Palaniswami

దేశమంతా మూడు భాషల బోధనా సూత్రాన్ని పాటించమనడం బాధాకరం అని, ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశంపై పునరాలోచించాలి అని పళని స్వామి అన్నారు. బాష విషయంలో తమిళనాడు ప్రాంతం వాళ్ళు ఎప్పుడు గట్టిగా ఉంటారని అందరికి తెలిసిన సత్యం. వారి సంస్కృతి, పండగలలో ఎటువంటి లోటు జరిగిన పోరాటాలు చేసి మరీ వారి సంస్కృతిని కాపాడుకుంటూ వస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version