అబ్బాయిలు పుడతారన్న ఆశతో.. డేరా బాబాకు బాలుడిని దానం

-

సమాజం ఎంత ముందుకెళ్తున్నా కొన్ని ప్రాంతాలు మాత్రం ఇంకా మూఢ నమ్మకాలతో అంధకారంలోనే ఉన్నాయి. మిలేనియల్ జనరేషన్ లో కూడా ఇంకా అబ్బాయిలే పుట్టాలని కొందరు మూఢ ఆచారాలను follow అవుతున్నారు. అలాంటి ఓ సంఘటన హరియాణా కైతాల్​లో చోటు చేసుకుంది.

అంబాలాకు చెందిన దంపతులు తమకు కుమారుడు పుడితే డేరా బాబా ఆశ్రమానికి దానం చేస్తామని మొక్కుకున్నారు. వారికి ఇదివరకే ఓ కుమార్తె ఉంది. చిన్నారి అమ్మమ్మ సాధ్వి ప్రభ ముని.. డేరా బాబా ఆశ్రమంలోనే పనిచేస్తున్నారు. డేరా బాబా అనుగ్రహం ఉంటే ఇంకా మగపిల్లలు పుడతారని తమ విశ్వాసమని.. అందుకే దంపతులు బాలుడిని ఆశ్రమానికి దానం చేశారని సాధ్వి ప్రభ ముని చెప్పారు.

చిన్నారి తల్లిదండ్రులు ప్రస్తుతం ముంబయిలో ఉద్యోగం చేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు డేరా బాబా ఆశ్రమానికి చేరుకుని దర్యాప్తు చేశారు. చిన్నారిని ఆశ్రమం నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. చిన్నారి తల్లిదండ్రులను ముంబయి నుంచి కైతాల్​కు పిలిపించారు పోలీసులు. ఈ ఘటన బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ దృష్టికి చేరగా.. వెంటనే దర్యాప్తునకు ఆదేశించింది

Read more RELATED
Recommended to you

Latest news