ఫోన్లో సిగ్నల్ లేదా..వైఫై తో కాల్ చెయొచ్చు తెలుసా..?

-

చదువుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ ను వినియోగిస్తున్నారు.అందుకే మార్కెట్ లో ఫోన్లకు డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంది.జనాల అభిరుచికి తగ్గట్లు ఆయా కంపెనీలు కూడా కొత్త టెక్నాలజీ తో కొత్త ఫీచర్లతో అందుబాటులోకి వస్తున్నాయి.ఫోన్ పని చేయకపోయినా, సిగ్నల్ లేకపోయినా చాలా ఇబ్బంది పడిపోతాం. ఎవరికైనా అర్జంటుగా ఫోన్ చేయాల్సిన పరిస్థితి ఉంటే సిగ్నల్ లేక ఇబ్బంది పడుతుంటారు.ఏదైనా ఓటీపీ వచ్చే సమయంలో ఇలా జరిగితే చాలా చికాకుగా అనిపిస్తుంది. ఇలా నెట్ వర్క్ సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. అయితే దీనికి ఓ పరిష్కారం కూడా ఉంది.

మీకు వైఫై ఉంటే దాని ద్వారా ఫోన్ కాల్ చేయొచ్చు. వైఫై కాలింగ్ ఫీచర్తో మెసేజ్ సదుపాయం కూడా పొందొచ్చు. అయితే మన ఫోన్లలో దీనికి సంబంధించి కొన్ని మార్పులు చేసుకోవాలి. సెట్టింగ్స్లోకి వెళ్లి చిన్న మార్పులు చేయడం ద్వారా ఈ సేవలు మనం పొందొచ్చు. దానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వైఫై కాలింగ్ను మీరు ఉపయోగించుకోవాలంటే అందుకు మీ ఫోన్లు దీనికి సపోర్ట్ చేయాలి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న చాలా ఫోన్లు వైఫై కాలింగ్కు సపోర్ట్ చేస్తున్నాయి.

WiFi కాలింగ్ అనేది సాధారణంగా గత కొన్నేళ్లుగా వచ్చిన ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో అందుబాటులో ఉంది. అయితే దీనిని ఉపయోగించుకోవాలంటే కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవాలి. Google Pixel ఫోన్ల వంటి ఫోన్లలో ఉండే Google Phone యాప్ని ఉపయోగిస్తుంటే వైఫై కాలింగ్ కోసం ఇలా మార్పులు చేసుకోవాలి..ముందుగా ఫోన్ యాప్ను ఓపెన్ చేయాలి. మెనూను ఓపెన్ చేయడానికి పై భాగంలో నిలువుగా ఉండే మూడు చుక్కలను క్లిక్ చేయాలి.

ఆ తర్వాత సెట్టింగ్స్ను ఎంచుకోవాలి. అక్కడ మీకు వైఫై కాలింగ్ కనిపిస్తుంది. దానిని మీరు టోగుల్ చేయడం ద్వారా వైఫై కాలింగ్ను పొందవచ్చు. ఇలా ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీరు కాల్స్ ఎంచుకుని చక్కగా ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. మీ వద్ద శాంసంగ్ ఫోన్లు ఉండే ఇలా చేయాలి. ముందుగా సెట్టింగ్స్లోకి వెళ్లాలి. తర్వాత కనెక్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news