ఈమె చేసిన ఆ ఒక్క పనే పసిపిల్లల ప్రాణాలు కాపాడింది..హ్యాట్సాఫ్..

-

తల్లి పాలు శిశువుకు చాలా మంచివి.వాటిలో పోషకాలు ఎక్కువ..అందుకే ఆరు నెలల వరకూ తల్లి పాలను ఇవ్వాలని పెద్దలు చెబుతారు.ఈరోజుల్లో తల్లులకు పాలు పడటం చాలా తక్కువ.దాంతో ఎక్కువగా పోత పాలు పట్టిస్తున్నారు.పోత పాలు కంటే తల్లి పాలు వల్ల కావాల్సిన పోషకాలన్ని అందుతాయని వైద్యులు చెబుతారు. శిశువులు పుట్టినప్పటి నుంచి రెండేళ్ల పాటు ఇవ్వాలని వైద్యులు సూచిస్తారు. కొన్ని అనారోగ్యాల కారణంగా కొంత మంది తల్లులు తమ శిశువులకు పాలు అందించలేక పోతున్నారు. దీంతో ఆ శిశువులు బలహీనంగా ఉండడంతో శిశువులకు అనేక చికిత్సలు అందించాల్సిన పరిస్థితి నెలకొంటుంది.

ప్రస్తుతం అనేక ఆరోగ్య సమస్యలతో దాదాపుగా 40 నుంచి 50 శాతం మంది తల్లులు శిశువులకు పాలు అందించలేక పౌడర్ పాలు పట్టిస్తున్నారు. తల్లి పాలు లేని శిశువులకు ఓ సంస్ధ వరంగా మారితే, ఏకంగా ఆ సంస్ధకు ఏడాదిలో దాదాపు 42 లీటర్ల తల్లి పాలు అందించి మహిళా స్వరూపిణిగా మారింది. తల్లి పాలు లేని ఎంతో మంది శిశువులకు ఆమె అమ్మగా మరింది.శిశువులను ఆదుకునేందుకు రూప సెల్వ నాయకి అనే మహిళా అమృతం అనే స్వచ్చంధ సంస్థను కొన్నేళ్ల క్రితం ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సంస్థలో దాదాపు 50 మంది మహిళలు నమోదు చేసుకున్నారు.

ఇప్పుడు 30 మందికిపైగా తల్లులు పాలను దానం ఇస్తుండగా, ఆ పాలను అనాథలు లేదా పాలు ఇవ్వలేని బాలింతల శిశువులకు రాష్ట్ర చైల్డ్ హెల్త్ శాఖ ద్వారా అందిస్తున్నారు. దేశ వ్యాప్తంగా కేవలం 70 బ్రెస్ట్ మిల్క్ బ్యాంకులు ఉండగా, అందులో ఒక్క తమిళనాడులోనే 45 ఉన్నాయి. మొత్తం 35 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఈ కేంద్రాలు ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్ కు చెందిన మహేశ్వరన్, సింధు మౌనిక దంపతులకు 18 నెలల కుమార్తె ఉంది. ఓ యూట్యూబ్ ఛానల్ ద్వారా అమృతం స్వచ్చంధ సంస్థ ఉందని తెలుసుకున్న సింధు మౌనిక తన పాలను తల్లి పాలు లేని శిశువులకు ఇవ్వాలని నిర్ణయించుకుంది.

ఇది ఇలా వుండగా.. సింధు మౌనిక గతేడాది జులై నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు 42 లీటర్ల పాలను అమృతం స్వచ్చంధ సంస్థకు దానం చేసింది. ఆ పాలను ఇంటి వద్దకే వచ్చి సంస్థ ఎన్జీఓలు సేకరించుకొనే వాళ్ళు. ఇలా సేకరించిన పాలను ఇంటెన్సివ్ కేర్ లో చికిత్స పొందుతున్న చిన్నారులకు అందించారు. పాలను దానం చేసిన విషయం తెలుసుకున్న ఇండియన్ బుక్ అఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ అఫ్ రికార్డ్స్ సంస్ధ ప్రతినిధులు సింధు మౌనికకు ఆ సంస్ధల్లో స్థానం కల్పించారు..ఈ విషయంపై తమిళనాడు ప్రజలు ఆమె పై ప్రశంసలు కురిపిస్తున్నారు..నీ లాగా అందరూ ఆలోచిస్తే ఎందరో పసిపిల్లల ప్రాణాలు నిలుస్తాయి..నిజంగా గ్రేట్..హ్యాట్సాఫ్

Read more RELATED
Recommended to you

Latest news