వందేభారత్‌ రైళ్లే కావాలంటున్న ప్రయాణికులు..? కేంద్రం ప్లాన్‌ ప్రకారమే ఇలా జరుగుతోందా..?

-

వందేభారత్‌ రైళ్లు రైల్వే చరిత్రలోనే కొత్త అధ్యాయానికి నాంది పలికాయి. వీటికి బయట ఎంత క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పన్కర్లేదు. చూసేందుకు, సెల్ఫీలు దిగేందుకు జనాలు ఎగబడుతున్నారు. టికెట్‌ ధర కాస్త ఎక్కువైనా సూపర్‌ ఫాస్ట్ ట్రైన్లలను పక్కనపెట్టి మరీ వందేభారత్‌ ట్రైన్లనే బుక్ చేసుకుంటున్నారు. ఎందుకు ప్రయాణికుల్లో వందేభారత్‌కు డిమాండ్‌ పెరిగింది.? కేంద్ర ప్రభుత్వం ప్లాన్ ప్రకారం చేస్తోందో లేక పరిస్థితులే అలా ఉన్నాయా..? పాత ఎక్స్‌ప్రెస్‌ల బదులు వందే భారత్‌లే కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.

vande bharat train

మొన్నటి దాకా వందే భారత్‌లు సామాన్య ప్రయాణికులకు అందుబాటులో లేవు. విపరీతమైన టికెట్ ధరలతో సామాన్యులు ఆ రైళ్లను లైట్‌ తీసుకున్నారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో శాఖ ఆలోచించింది. ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ల ధరలను తగ్గించింది. దాంతో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది.

దేశవ్యాప్తంగా ప్రజలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు కావాలని ప్రయాణికులు కోరుతున్నారు. నిజానికి అవేమీ అతి వేగంతో వెళ్లట్లేదు. మిగతా రైళ్లు వెళ్లే వేగంతోనే వెళ్తున్నాయి. కాకపోతే తక్కువ స్టేషన్ల దగ్గర ఆగుతున్నాయి. అది కూడా ఒకట్రెండు నిమిషాలే ఆగుతున్నాయి. అందువల్ల తక్కువ టైమ్‌లో డెస్టినేషన్ చేరుకుంటున్నారు.

వందే భారత్‌ల వల్ల.. మిగతా ఎక్స్‌ప్రెస్‌లూ, సూపర్ ఫాస్ట్‌లను మధ్యమధ్యలో ఆపేస్తున్నారు. అందువల్ల అవి గంటల తరబడి ఆలస్యంగా డెస్టినేషన్ చేరుకుంటున్నాయి. అందుకే వాటిలో ప్రయాణించేవారు వాటిలో కంటే వందే భారతే బెటర్ అనుకొని వాటికి షిఫ్ట్ అవుతున్నారు. దీని వల్ల రైల్వేకి భారీగా ఆదాయం వస్తోంది. ఒక రకంగా ఇక్కడ ప్రయాణికులు నష్టపోతున్నట్లే. ఎందుకంటే.. మామూలు రైళ్లను కూడా వందే భారత్‌ల తరహాలోనే నడిపితే.. అప్పుడు వందే భారత్‌లు ఎవరు ఎక్కుతారు? అనే ప్రశ్నకు రైల్వే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

ప్రస్తుతం వందే భారత్‌లు ఫుల్ ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. వెయిటింగ్ లిస్ట్ భారీగా ఉంటోంది. ఐతే.. 50 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న రైళ్లలో ఛార్జీలను రైల్వే శాఖ ఈమధ్య 25 శాతం తగ్గించింది. దాంతో ఆ రైళ్లలో ఆక్యుపెన్సీ పెరిగింది.

దేశవ్యాప్తంగా 25 వందే భారత్‌ రైళ్లు నడుస్తున్నాయి. ఇది దాదాపు అన్ని రాష్ట్రాలనూ కవర్ చేస్తున్నాయి. ప్రతీ రైలూ రోజూ రెండుసార్లు నడుస్తూ ఉండటం వల్ల 50 సర్వీసులు అందుతున్నాయి. వారానికి కనీసం 2 కొత్త వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. మొత్తం 400 రైళ్లను తేవాలనేది రైల్వే శాఖ ప్లాన్.

తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని వచ్చే అవకాశం..

తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని వందే భారత్‌లు రానున్నాయి. సికింద్రాబాద్-నాగపూర్, సికింద్రాబాద్-భువనేశ్వర్, సికింద్రాబాద్-పుణే, కాచిగూడ-బెంగళూరు రూట్లలో త్వరలో వందే భారత్‌లు వస్తాయని సమాచారం. నాన్ ఏసీ వందే భారత్ సాధారణ్ రైళ్లు, వందే స్లీపర్ రైళ్లు కూడా త్వరలో రానున్నాయట. కొత్తమోజులో పడి మనకు మనమే నష్టాన్ని కలిగించుకుంటున్నామా..? లేక టైమ్‌ సేవ్‌ చేసుకుంటున్నామా అనేది ఇక ఆ ఈశ్వరునికే ఎరుక..!

Read more RELATED
Recommended to you

Latest news