పాకిస్తాన్‌ కెప్టెన్‌గా షాహీన్‌ అఫ్రిది..?

-

World Cup 2023 : వరల్డ్ కప్ లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు పేలవమైన ప్రదర్శనతో కనీసం సెమీస్ కు కూడా చేరకుండానే ఇంటికి వెళ్లిపోయింది. అయితే.. వరల్డ్ కప్ లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు పేలవమైన ప్రదర్శన నేపథ్యంలో అన్ని ఫార్మాట్లలో పాకిస్తాన్ కెప్టెన్సీకి బాబర్ అజామ్ గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు టెస్ట్, టి20 ఫార్మాట్ లలో తమ కొత్త కెప్టెన్లను ప్రకటించింది.

PCB appoints Shaheen Afridi as Pakistan's T20I captain, Masood to lead Test side
PCB appoints Shaheen Afridi as Pakistan’s T20I captain, Masood to lead Test side

పాకిస్తాన్ టి20 కెప్టెన్ గా స్టార్ పెసర్ షాహిన్ షా ఆఫ్రిది ఎంపికయ్యాడు. అదేవిధంగా తమ టెస్టు కెప్టెన్ గా వెటరన్ ఆటగాడు షాన్ మసూద్ ను పీసీబీ నియమించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పీసీబీ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే వన్డేలకు మాత్రం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ కొత్త కెప్టెన్ ను ప్రకటించలేదు. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ కు వన్డేల్లో సారథ్య బాధ్యతలు అప్పగించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news