బియ్యం ఎగుమతులపై నిషేధం..సూపర్‌ మార్కెట్ల ముందు క్యూ కట్టిన జనాలు

-

బియ్యం ఎగుమతులపై భారత ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో అమెరికాలో బియ్యం రేట్లు భారీగా పెరుగుతున్నాయి. విదేశాలకు బియ్యం ఎగుమతులపై భారత్ నిషేధం విధించడంతో.. ఆందోళనలో బియ్యం కోసం ఎగబడుతున్నారు ఎన్నారైలు.

అమెరికాలో ఉన్న భారతీయులు క్యూలు కట్టి బియ్యం కొనుగోలు చేస్తున్నారు. గతంలో ఒక రైస్ బ్యాగ్ 22 డాలర్లు ఉంటే… ఇప్పుడు 32-47 డాలర్ల వరకు అమ్ముతున్నారని చెబుతున్నారు. కొన్ని స్టోర్లలో ఒకరికి ఒకటే బ్యాగ్ అమ్ముతుండగా… మరికొన్ని స్టోర్ లలో లిమిట్ పెట్టట్లేదు. అంతేకాదు.. ఒక్కక్కరికి 5 బ్యాగులు మాత్రమే ఇస్తున్నారు నిర్వాహకులు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news