రైతులకు గుడ్ న్యూస్.. డ్రాగన్‌ పండ్ల సాగుకు కేంద్రం ఆర్థిక సాయం

-

ఔషధ గుణాలున్న డ్రాగన్ ఫ్రూట్ పంట సాగును ప్రోత్సహించడంపై కేంద్ర సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ పంటను సాగు చేసే రైతులకు ప్రోత్సాహం అందించాలని నిర్ణయించింది. ఉపాధి హామీ పథకం ద్వారా మూడేళ్ల పాటు రూ.2.50 లక్షల ప్రోత్సాహం అందించనుంది. అరుదైన పంట కావడంతో ఈ పథకంపై రైతులకు అన్నివిధాలా అవగాహన కల్పించేందుకు గ్రామీణాభివృద్ధిశాఖ సిద్ధమవుతోంది.

ప్రోత్సాహకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

ఉపాధిహామీ జాబ్‌కార్డు కలిగి అయిదెకరాల్లోపు భూమి ఉన్న రైతులే ఈ ప్రోత్సాహకానికి అర్హులు. నీటి వసతి ఉండాలి. పట్టా, ఆధార్‌, బ్యాంకు ఖాతా, జాబ్‌కార్డుతో సంబంధిత మండల ఎంపీడీఓ లేదా ఈజీఎస్‌ ఏపీవోలకు దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ఠంగా అరెకరం సాగుకే ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. ఉపాధిహామీ ద్వారా మొదటి ఏడాది రూ.1,80,972, తరువాత రెండేళ్లు రూ.34,650 చొప్పున విడుదలవుతాయి. తెలంగాణలో ములుగు, సిద్దిపేటలో ఈ మొక్కల పెంపకం కోసం ప్రభుత్వ నర్సరీలు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి నేలల్లోనైనా పెరిగే ఈ మొక్కలు ఒక్కసారి నాటితే సుమారు 20 ఏళ్లపాటు దిగుబడి ఇస్తాయని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news