అమెరికాలో ఎంఎస్ చదువుతున్న తెలంగాణ విద్యార్థిపై దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఖమ్మంలోని మామిళ్లగూడేనికి చెందిన పుచ్చా వరుణ్‌రాజ్ ఇండియానా రాష్ట్రంలోని వాల్పరైసో నగరంలోని ఓ విశ్వవిద్యాలయంలో. ఎంఎస్ చదువుతూ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. మంగళవారం జిమ్ నుంచి వరుణ్ ఇంటికి వెళ్తుండగా ఒక దుండగుడు కత్తితో కణతపై పొడిచాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు చేరుకుని ఆసుపత్రి తరలించారు.
వైద్యులు వరుణ్‌కు శస్త్రచికిత్స చేశారని యువకుడి తండ్రి రామ్మూర్తి తెలిపారు. వరుణ్‌పై దాడి చేసిన జోర్డాన్ ఆండ్రాడ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరుణ్‌పై ఆండ్రాడ్ కత్తితో బలంగా దాడి చేశాడని.. గాయం తీవ్రంగా ఉందని… పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారని ఇండియానా పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం వరుణ్ అపస్మారక స్థితిలో ఉన్నాడని తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రామ్మూర్తి… తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌ను కలిసి తమ కుమారుడికి మెరుగైన వైద్యం అందేలా సాయం చేయాలని కోరారు.