ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా – లఖ్నవూ ఎక్స్ప్రెస్ వేలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డబుల్ డెక్కర్ బస్సు, ఓ కారును ఢీకొ నడంతో ఏడుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘రాయ్బరేలీ నుంచి దిల్లీ వెళ్తున్న బస్సు శనివారం రాత్రి సుమారుగా 12.30 గంటల సమయంలో, ఓ కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని నలుగురు, కారులోని ముగ్గురు వ్యక్తులు మరణించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించాం. ఘటన ఎలా జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నాం. నిద్రమత్తులో నడపడం లేదా మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్లో ఈ ఘటన జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నాం’ అని పోలీసులు తెలిపారు.