మరోసారి అయోధ్యకు మోదీ.. బాలరాముడి ముందు సాష్టాంగ నమస్కారం

-

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఉత్తర్ప్రదేశ్ అయోధ్యలో పర్యటించారు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత తొలిసారి మోదీ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలరాముడికి హారతి ఇచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు. అనంతరం స్థానికంగా నిర్వహించిన భారీ రోడ్‌ షోలో మోదీ పాల్గొన్నారు.

సుగ్రీవ కోట నుంచి లతా చౌక్‌ వరకు రెండు కిలోమీటర్ల మేర ప్రధాని రోడ్‌ షో జరిగింది. ఓవైపు ఆదివారం కావడం, మరోవైపు ప్రధాని రాక నేపథ్యంలో అయోధ్యకు ప్రజలు భారీగా తరలిరావడంతో ఆలయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అయోధ్య ఉన్న ఫైజాబాద్‌ లోక్సభ స్థానానికి ఐదో విడతలో భాగంగా మే 20వ తేదీన పోలింగ్‌ జరగనుంది.

 

“భారత్ కోసం వచ్చే ఐదేళ్లు కాదు 25 ఏళ్ల కోసం బాటలు వేస్తున్నాం. మోదీ ఉన్నా లేకపోయినా దేశం ఎప్పటికీ ఉంటుంది. ఎస్‌పీ, కాంగ్రెస్‌లు ఏం చేస్తున్నాయి? తమ భవిష్యత్తు కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. మోదీ ఎవరి కోసం పనిచేస్తున్నారు? నేను ఏదీ వెనుక దాచుకోలేదు. యోగీ కూడా అలాగే ఉంటారు. మోదీ అలాగే ఉంటారు. యోగీ, మోదీ ఎవరి కోసం పనిచేస్తున్నారు. మాకు పిల్లలు లేరు. మీ పిల్లల కోసమే మేం పనిచేస్తున్నాం.” అని మోదీ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version