ఐదు ఎయిమ్స్‌లను ప్రారంభించి జాతికి అంకితమిచ్చిన ప్రధాని మోదీ

-

దేశవ్యాప్తంగా ఒకేరోజు ఐదు ఎయిమ్స్‌ ఆసుపత్రులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఆదివారం రోజున ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మించిన ఎయిమ్స్‌ను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. మంగళగిరితో పాటు రాజ్‌ కోట్‌ (గుజరాత్‌), బఠిండా (పంజాబ్‌), రాయ్‌ బరేలి (ఉత్తర్ ప్రదేశ్‌), కల్యాణి (పశ్చిమ బెంగాల్‌) నగరాల్లో ఎయిమ్స్‌ ఆస్పత్రులను ప్రారంభించారు. అనంతరం ప్రధాని మోదీ ప్రసంగించారు.

‘స్వాతంత్య్రం వచ్చాక 50 ఏళ్ల వరకు దేశంలో ఒకే ఒక్క ఎయిమ్స్ ఉండేదని మోదీ అన్నారు. అది కూడా దిల్లీలో మాత్రమేనని తెలిపారు. ఏడు ఎయిమ్స్‌లకు మాత్రమే ఆమోదం లభించిందని.. కానీ అవీ పూర్తి కాలేదని చెప్పారు. ఈరోజు ఏడు కొత్త ఎయిమ్స్‌లకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు జరిగాయని వివరించారు. గత ఆరేడు దశాబ్దాల్లో జరిగిన దాని కంటే చాలా వేగంగా దేశాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెబుతున్నానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా తేల్చి చెప్పారు. మరోసారి అధికారంలోకి వస్తే ఇంతకు రెట్టింపు ప్రగతి పథంలో దేశాన్ని నడిపిస్తామని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version