ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ

-

దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దిల్లీలోని ఎర్ర కోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండా ఎగురవేశారు. ఆ సమయంలో ఎర్రకోట వద్ద ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిసింది. వరుసగా 11వ సారి ప్రధానిగా మోదీ జెండా ఎగురవేశారు. 2047 వికసిత భారత్‌ థీమ్‌తో పంద్రాగస్టు వేడుకలు నిర్వహిస్తున్నారు. వేడుకలకు దాదాపు 6 వేల మంది ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. అంతకు ముందు ప్రధాని మోదీ రాజ్‌ఘాట్‌ వద్ద మహాత్మా గాంధీకి నివాళి అర్పించారు.

జెండా ఎగురవేసిన అనంతరం ప్రధాని మోదీ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. వికసిత భారత్‌ లక్ష్య సాధనలో భాగంగా 2047 నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాలు, అందుకు కార్యాచరణను వివరించారు. పంద్రాగస్టు సందర్భంగా ఎర్రకోట నుంచి వరుసగా పదేళ్లు పతాకావిష్కరణ చేసిన కాంగ్రెసేతర పార్టీల ప్రధాన మంత్రుల్లో మొట్ట మొదటి నేతగా నరేంద్ర మోదీ నిలిచారు.

Read more RELATED
Recommended to you

Latest news