నమో భారత్​ ప్రారంభించిన మోదీ.. చిన్నారులతో కలిసి సరదాగా రైలు ప్రయాణం

-

వందే భారత్‌ రైళ్ల తరహాలో దేశంలో తొలిసారిగా ప్రవేశపెట్టిన ర్యాపిడ్‌ ఎక్స్‌ సెమీ-హైస్పీడ్‌ రైళ్లను దిల్లీలో ప్రధాని మోదీ ప్రారంభించారు. వీటికి నమో భారత్‌గా నామకరణం చేశారు. సాహిబాబాద్‌, దూహై డిపో మధ్య 17 కిలోమీటర్ల కారిడార్‌లో ప్రయాణించే రైలును పచ్చ జెండా ఊపి ప్రధాని మోదీ ప్రారంభించారు. మోదీతోపాటు ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  దిల్లీ- గాజియాబాద్‌- మేరఠ్‌ మధ్య రూ.30,000 కోట్లతో చేపట్టిన రీజనల్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ ఆర్ఆర్టీఎస్ నడవాలో సాహిబాబాద్‌-దుహై డిపో మధ్య ముందుగా 17 కి.మీ. దూరానికి ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది. ఈ రెండింటి మధ్య అయిదు స్టేషన్లు ఉంటాయి.

నమో భారత్ రైలు గురించి తెలుసుకోవాల్సిన విషయాలు

  • గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ రైల్లో  అనేక అధునాతన వసతులు ఏర్పాటు చేశారు.
  • పూర్తిగా ఎయిర్‌ కండిషన్డ్‌, 2 ఇన్‌టూ 2 లేఅవుట్‌లో సీట్లు నిలబడేందుకు విశాలమైన ప్రదేశం ఈ రైళ్లలో ఉంటుంది.
  • అక్టోబర్‌ 21 నుంచి ఈ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయి.
  • ప్రతి రైలులో ఆరు కోచ్‌లు ఉంటాయి. ప్రామాణిక కోచ్‌లలో 72, ప్రీమియం తరగతిలో 62 సీట్లు చొప్పున ఉంటాయి.
  • నిల్చొని ప్రయాణించేవారితో కలిపి ఏకకాలంలో 1,700 మంది వీటిలో వెళ్లవచ్చు.
  • ప్రామాణిక కోచ్‌లలో టికెట్‌ ధర రూ.20-50 మధ్య, ప్రీమియం కోచ్‌లలో రూ.40-100 మధ్య ఉంటుంది.
  • ప్రతి రైలులో ఒక కోచ్‌ను మహిళలకు కేటాయించారు. మహిళలు, దివ్యాంగులు, వయోవృద్ధులకు ప్రతి కోచ్‌లోనూ కొన్నిసీట్లను కేటాయించారు.
  • నమో భారత్‌  రైళ్లు ఉదయం ఆరు నుంచి రాత్రి 11 గంటల వరకూ..ప్రయాణికులకు సేవలందిస్తాయి. ప్రతి 15 నిమిషాలకు ఒక రైలు అందుబాటులో ఉంటుంది

Read more RELATED
Recommended to you

Latest news