చైనా దేశంలో జరుగుతున్న ఆసియా క్రీడలలో మన ఇండియా చరిత్ర సృష్టించింది. ఆసియా క్రీడాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు… దూసుకుపోతుంది టీమిండియా. ఈ నేపథ్యంలోనే ఆసియా క్రీడాలలో అరుదైన మైలురాయిని అందుకుంది భారత్. ఈ క్రీడాలలో మొదటిసారిగా మొత్తం 100 పతకాలు కైవసం చేసుకుంది ఇండియా.
భారత్ పేరిట 2010 సంవత్సరంలో 65 పతకాలు రాగా…. 2014 సంవత్సరంలో 57 పతకాలు వచ్చాయి. 2018 సంవత్సరంలో 70 పథకాలు మాత్రమే ఉన్నాయి. ఇక ఈ క్రీడాలలో 25 గోల్డ్, 25 రజతం 40 కాస్య పతకాలను భారత క్రీడాకారులు కొల్లగొట్టారు. పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. అటు చైనా 354 మోడల్స్ తో మొదటి స్థానంలో ఉంది.
ఇక దీనిపై నరేంద్ర మోడీ స్పందించారు. ఆసియా క్రీడల్లో భారత్‌కు అద్భుత విజయం అని.. మనం 100 పతకాల మైలురాయిని చేరుకున్నందుకు భారత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నానన్నారు. భారతదేశానికి ఈ చారిత్రాత్మక మైలురాయికి కారణమైన మన అసాధారణ క్రీడాకారులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను….ప్రతి విస్మయం కలిగించే ప్రదర్శన చరిత్ర సృష్టించింది మరియు మన హృదయాలను గర్వంతో నింపింది…నేను 10వ తేదీన మా ఆసియా క్రీడల బృందానికి ఆతిథ్యం ఇవ్వడానికి మరియు మా అథ్లెట్లతో సంభాషించడానికి ఎదురుచూస్తున్నానని తెలిపారు ప్రధాని మోడీ.