ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 కాగానే అందరికీ గుర్తుకొచ్చే కార్యక్రమం ప్రధానమంత్రి మన్ కీ బాత్. 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ ప్రజలతో ఏదో ఒక రూపంలో నిరంతరం ఇంటరాక్ట్ అవ్వాలనుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిందే మన్ కీ బాత్. ఈ కార్యక్రమం ద్వారా తన మనసులోని భావాలను వ్యక్తీకరించడమే కాకుండా.. ఆ నెలలో దేశంలో, ప్రపంచంలో చోటుచేసుకున్న కీలక సంఘటనల గురించి మాట్లాడుతుంటూరు.
టీవీ ముందు రేడియో వెలవెలబోతున్న తరుణంలో ఆయన ఈ కార్యక్రమం నిర్వహణ కోసం ఆకాశవాణిని ఎంచుకోవడం గమనార్హం. 2014 అక్టోబర్ 3వ తేదీన విజయదశమి నాడు ఈ కార్యక్రమాన్ని ప్రారభించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధాని నరేంద్రమోదీ 104వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమం జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రధాని 104వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రధాని మోదీ ప్రస్తుతం ఉక్రెయిన్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.