వ్యోమగాములు సునీతా, బుచ్ విల్‌మోర్ రాకపై అమెరికా అంతరిక్ష సంస్థ నాసా క్లారిటీ ఇచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వాళ్లిద్దరు భూమికి రానున్నట్టు వెల్లడించింది. స్పేస్‌ఎక్స్ అంతరిక్ష నౌక ద్వారా వారిని భూమిపైకి తీసుకురానున్నట్లు తెలిపింది. సాంకేతిక సమస్యతో వ్యోమగాములు సునీతా, విల్‌మోర్ ఐఎస్‌ఎస్‌లోనే ఉన్నవిషయం తెలిసిందే. జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. వారంలో తిరిగి రావాల్సి ఉండగా.. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో తిరుగు ప్రయాణం జాప్యమైంది.
స్టార్‌లైనర్ వ్యోమనౌకలో సునీత, విల్‌మోర్‌లు ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన తర్వాత ఆ వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో వారి తిరుగు ప్రయాణం ఆలస్యం అవుతోంది. ఈ సమస్యల పరిష్కారానికి చాలా సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబరులో మానవరహితంగానే స్టార్‌లైనర్‌ను నేల మీదకు తీసుకొస్తారు. ఆ తర్వాత ఫిబ్రవరిలో స్పేస్ ఎక్స్ అంతరిక్ష నౌకను స్పేస్కు పంపించి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లను భూమిపైకి తిరిగి తీసుకు రానున్నట్లు నాసా శనివారం రోజున ఓ ప్రకటనలో వెల్లడించింది.