30న కన్యాకుమారికి మోదీ.. 48 గంటల పాటు నాన్ స్టాప్ మెడిటేషన్

-

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా క్షణం తీరిక లేకుండా వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపిన ప్రధాని మోదీ,. ఉపశమనం పొందేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 30వ తేదీన లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత కన్యాకుమారిలో పర్యటించనున్నారు.

స్వామి వివేకానంద స్మారకార్థం నిర్మించిన రాక్‌ మెమోరియల్‌ వద్ద మోదీ ధ్యానం చేయనున్నారు. గతంలో స్వామి వివేకానంద ధ్యానం చేసిన ప్రాంతంలోనే మోదీ ధ్యానం చేస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి. 30వ తేదీ నుంచి జూన్‌1 సాయంత్రం వరకూ అంటే 48 గంటల పాటు ప్రధాని మోదీ ధ్యాన మండపంలో ధ్యానం చేస్తారని పేర్కొన్నాయి. 2019 ఎన్నికల తర్వాత మోదీ కేదార్‌నాథ్‌ గుహలో ఇలాగే ధాన్యం చేశారు. ఈసారి కన్యాకుమారిని తన ఆధ్యాత్మిక విహారానికి వేదికగా మోదీ  ఎంచుకున్నారు.

కన్యాకుమారి రాక్ మెమోరియల్‌‌‌ వద్ద ధ్యానం చేసిన తర్వాతే స్వామి వివేకానందుడికి తన కర్తవ్యం బోధపడిందని చెబుతారు. భారత దేశ నిర్మాణం కోసం ఏం చేయాలనేది అక్కడే ఆయన నిర్ణయించుకున్నారని అంటారు. అందుకే ఈసారి మెడిటేషన్ చేయడానికి స్వామి వివేకానంద రాక్ మెమోరియల్‌ను ప్రధాని మోదీ ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news