పెళ్లి జరిగిన సంప్రదాయం ప్రకారమే విడాకులు : హైకోర్టు తీర్పు

-

హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న ఎస్టీ (లంబాడా) దంపతులకు హిందూ వివాహ చట్టం ప్రకారం విడాకులు మంజూరు చేయవచ్చని ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చింది. హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నందున హిందూ వివాహ చట్టంలోని సెక్షన్‌ 2(2)ను మినహాయించవచ్చని తెలిపింది. ఈ సెక్షన్‌ ప్రకారం ఎస్టీలకు హిందూ వివాహ చట్టం వర్తింపజేయాలంటే కేంద్రం నోటిఫై చేయాల్సి ఉంటుందని పేర్కొంది. పెళ్లి హిందూ సంప్రదాయం ప్రకారం జరిగినందున కేంద్రం నోటిఫై చేయకపోయినా ఇదే చట్టం కింద విడాకులు మంజూరు చేయవచ్చని స్పష్టం చేసింది.

2019 మేలో పెళ్లి చేసుకున్న కామారెడ్డి జిల్లా నర్సులాబాద్‌ మండలం మైలారం తండాకు చెందిన ఎస్టీ యువతీ, యువకుల మధ్య ఏడాది కాపురం తర్వాత విభేదాలు తలెత్తగా పెద్దల ఒప్పందం ప్రకారం 2023లో విడిపోయారు. అనంతరం పరస్పర అంగీకారంతో విడాకుల నిమిత్తం హిందూ వివాహ చట్టంలోని సెక్షన్‌ 13(బి) కింద కామారెడ్డి కోర్టులో పిటిషన్‌ వేయగా.. సెక్షన్‌ 2(2) ప్రకారం కేంద్రం నోటిఫై చేయకుండా వర్తించదని, పిటిషన్‌ విచారణార్హం కాదని కోర్టు తిరస్కరించింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ భర్త హైకోర్టును ఆశ్రయించగా దీనిపై న్యాయమూర్తి జస్టిస్‌ అలిశెట్టి లక్ష్మీనారాయణ విచారణ చేపట్టి ఇటీవల తీర్పు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news