వచ్చే ఐదేళ్లలో 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులు చేస్తాం: మోదీ

-

వచ్చే ఐదేళ్లలో చిరు వ్యాపారులకు వడ్డీల బాధ తొలగిస్తామని ప్రధాని మోదీ అన్నారు. దివ్యాంగుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని, ఈ పదేళ్లలో 10 కోట్ల మంది మహిళలు స్వయం సహాయ సంఘాల్లో చేరారని తెలిపారు. మహిళలు పారిశ్రామికవేత్తలు కావాలని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులు చేస్తామని వెల్లడించారు. వ్యవసాయ రంగంలో డ్రోన్‌ల వినియోగం పెంచుతామని, భారత్‌ను గ్లోబల్‌ న్యూట్రిషన్‌ హబ్‌గా మారుస్తామని హామీ ఇచ్చారు. దిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయంలో లోక్సభ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు.

‘శ్రీ అన్న్ రకం పండించడం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. సముద్ర నాచు, ముత్యాల సాగు దిశగా మత్స్యకారులను ప్రోత్సహిస్తాం. భారత్‌ను ఫుడ్ ప్రాసెసింగ్‌ హబ్‌గా మారుస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్‌ పరిశ్రమల వల్ల గ్రామాల ఆదాయం పెరుగుతుంది. నానో యూరియా వినియోగం మరింత పెంచుతాం. బీజేపీ పాలనలో అభివృద్ధి, సంస్కృతి.. రెండింటికీ ప్రాధాన్యం. ప్రపంచ పర్యాటక కేంద్రంగా భారత్‌ను మారుస్తాం. పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తే ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయి. ఏజెన్సీలో పర్యాటకం ప్రోత్సహించి గిరిజనులకు మేలు చేస్తాం.’ అని మోదీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news