నాలుగు స్తంభాలతో సంకల్ప్ పత్రకు పునాదులు వేశాం: మోదీ

-

దిల్లీలోని బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ సంకల్ప పత్ర పేరుతో లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఇవాళ చాలా శుభదినం అని అన్నారు. నాలుగు స్తంభాలతో సంకల్ప్ పత్రకు పునాదులు వేశామని, యువశక్తి, నారీశక్తి, గరీబ్‌, కిసాన్‌ను దృష్టిలో ఉంచుకునే సంకల్ప్ పత్ర తయారీ చేశామని తెలిపారు. దేశ యువత ఆకాంక్షలను మా సంకల్ప్ పత్ర ప్రతిబింబిస్తోందని వెల్లడించారు. ఈ పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చామని చెప్పారు. పేదల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మోదీ పేర్కొన్నారు.

‘ఇవాళ చాలా శుభదినం. బంగాల్‌, అసోం, ఒడిశాలో ఇవాళ పండుగలు జరుపుకుంటున్నారు. కేరళ, తమిళనాడులోనూ ఇవాళ పండుగలు జరుపుకుంటున్నారు. నవరాత్రుల్లో భాగంగా ఇవాళ కాత్యాయనీ దేవి పూజ చేసుకుంటాం. ఇవాళ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ జయంతి కూడా. సంకల్ప్ పత్ర తయారు చేసిన రాజ్‌నాథ్‌ బృందానికి అభినందనలు. సంకల్ప్ పత్ర తయారీకి సూచనలు ఇచ్చిన లక్షలమందికి అభినందనలు.’ అని ప్రధాని మోదీ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news