‘భారత్‌ను చైనాతో పోల్చొద్దు’.. ప్రధాని మోదీ ఘాటు వ్యాఖ్యలు

-

భారత్ను పదేపదే చైనాతో పోల్చడంపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ స్పందించారు. ఆర్థిక వృద్ధి విషయంలో డ్రాగన్తో పోలికను ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వ్యతిరేకించారు. చైనాలోనియంతృత్వ పాలన ఉందని, భారత్లో ప్రజాస్వామ్య పాలన కొనసాగుతోందని.. రెండింటిని పోల్చడం సబబు కాదని స్పష్టం చేశారు. దేశంలో నిరుద్యోగం, అవినీతి, పాలనాపరమైన అడ్డంకులు, నైపుణ్యాల అంతరం ఉందంటూ వ్యక్తమవుతున్న ఆందోళనలను ప్రధాని తోసిపుచ్చారు.

ఆర్థిక వృద్ధి గురించి మాట్లాడేటప్పుడు భారత్‌ను చైనాతో పోల్చడం సరికాదని మోదీ పేర్కొన్నారు. దిల్లీని ఇతర ప్రజాస్వామ్య దేశాలతో పోలిస్తే మరింత సముచితంగా ఉంటుందని తెలిపారు. అవినీతి, నిరుద్యోగం వంటి సవాళ్లే ఉంటే.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్‌ గుర్తింపు సాధించేది కాదని స్పష్టం చేశారు. ప్రపంచ స్థాయి కంపెనీల్లో భారత సంతతి వ్యక్తులు సీఈవో హోదాల్లో ఉన్నారని, భారత్‌లో నైపుణ్యాల అంతరం లేదని చెప్పేందుకు ఇదే సరైన ఉదాహరణ అని మోదీ వెల్లడించారు. భారత్‌లో మైనార్టీలను అణచివేస్తున్నారన్న విమర్శలపైనా స్పందించిన ప్రధాని విమర్శకులు తమ అభిప్రాయాలు స్వేచ్ఛగా వెల్లడిస్తారని.. అలాంటి ఆరోపణలకు సమాధానం చెప్పి వాటిని ఖండించే హక్కు అవతలి పక్షానికి ఉంటుందని మోదీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news