ప్రపంచ ఫిన్​టెక్ రాజధానిగా ముంబయిని మారుస్తాను : మోదీ

-

ముంబయిని గ్లోబల్ ఫిన్ టెక్ రాజధానిగా మార్చాలనుకుంటున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గత 3 – 4 ఏళ్లలో దేశంలో 8 కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టించినట్లు తెలిపారు. ఆర్​బీఐ స్వయంగా ఈ గణాంకాలు వెల్లడించిందని అన్నారు.  ఉద్యోగ కల్పనపై తప్పుడు కథనాలను ప్రచారం చేసే వారి నోర్లు మూతబడ్డాయని పేర్కొన్నారు. ముంబయిలోని గోరేగావ్‌లో పర్యటించిన ప్రధాని ఆ రాష్ట్రంలో రోడ్డు, రైల్వే, ఓడరేవు రంగాల్లో రూ.29,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

దేశంలో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి దిశగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు.  ముంబయితో పాటు పరిసర ప్రాంతాల్లో రానున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆయా ప్రాంతాల్లో కనెక్టివిటీని పెంచుతాయని తెలిపారు. చిన్నపెద్దా తేడా లేకుండా పెట్టుబడిదారులంతా తమ ప్రభుత్వం మూడో దఫాను ఉత్సాహంతో స్వాగతించారని మోదీ పేర్కొన్నారు. మహారాష్ట్రను ప్రపంచంలోనే పెద్ద ఆర్థిక శక్తిగా, ముంబయిని ప్రపంచ ఫిన్‌టెక్ రాజధానిగా మార్చడం తమ లక్ష్యమని ఈ సందర్భంగా మోదీ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news