పోలాండ్ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ

-

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు బయల్దేరారు. ఆయన పోలాండ్, ఉక్రెయిన్లలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇవాళ పోలాండ్కు బయల్దేరారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత పోలాండ్లో పర్యటించేందుకు భారత ప్రధాని వెళ్తున్నారు. ఇవాళ, రేపు మోదీ ఆ దేశంలో పర్యటిస్తారు. భారత్‌-పోలాండ్‌ దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మోదీ పర్యటన సాగనుంది. ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ పోలెండ్ ప్రధాని డొనాల్డ్‌ టస్క్‌, అధ్యక్షుడు ఆండ్రెజ్‌ దూడతో సమావేశం కానున్నారు. మధ్య ఐరోపాలో భారత్‌కు కీలక ఆర్థిక భాగస్వామిగా ఉన్న పోలాండ్లో ఉన్న భారతీయులను ప్రధాని మోదీ కలవనున్నారు.

అనంతరం ఎల్లుండి పోలాండ్‌ నుంచి రైలులో ఉక్రెయిన్‌ వెళ్లనున్నారు. ఉక్రెయిన్‌లో పర్యటించనున్న తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించనున్నారు. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆహ్వానం మేరకు ఉక్రెయిన్‌ వెళ్తున్నట్లు ‘ఎక్స్‌’లో మోదీ వెల్లడించారు. ఉక్రెయిన్‌-రష్యా ఉద్రిక్తతల నేపథ్యంలో మోదీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఉక్రెయిన్‌లో శాంతి, స్థిరత్వం తిరిగి రావాలని ఆశిస్తున్నానని మోదీ ఎక్స్ వేదికగా తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version