PM Kisan: నేడే ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ డబ్బులు..ఇలా చెక్ చేసుకోండి

-

దేశంలోని రైతులకు మోడీ ప్రభుత్వం శుభవార్త. రైతులకు పెట్టుబడి సాయం కోసం కేంద్రం అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు ఇవాళ బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. 15వ విడత కింద అర్హులైన దాదాపు 8 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాల్లో రూ. 2000 చొప్పున జమ చేయనున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఝార్ఖండ్ లోని కుంటిలో బుధవారం ఉదయం 11:30 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ ఈ నిధులు విడుదల చేస్తారని పేర్కొంది.

PM Modi to release PM KISAN funds on November 15

ఎవరైతే ఈ-కేవైసీ పూర్తి చేస్తారో వారికి ఖాతాల్లో నిధులు జమ అవుతాయి. దేశవ్యాప్తంగా రైతులకు లబ్ధి జరిగేలా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరిట పథకాన్ని అమలుచేస్తోంది. ఏడాదిలో మూడు దఫాలుగా రూ. 6000 రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తుంటుంది. ఒక్కో విడతలో అర్హులైన రైతుల ఖాతాల్లోకి రూ. 2000 చొప్పున జమ చేస్తున్నారు. కేంద్రం ఇప్పటిదాకా ఈ పథకం కింద 14 విడతలుగా నిధులను విడుదల చేసింది. డబ్బులు పడ్డాయా ? లేదా అని చెక్ చేసుకోవడానికి https://pmkisan.gov.in/ ఈ సైట్‌ లో చూసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version